Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాధనం దుర్వినియోగం.. పట్టించుకోని అధికారులు

ప్రజాధనం దుర్వినియోగం.. పట్టించుకోని అధికారులు

- Advertisement -
  • కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీధర్..
  • నవతెలంగాణ – కాటారం
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని మూలమలుపు నుండి పెగడపల్లి వరకు రూ.16 కోట్ల నిర్మిస్తున్న రోడ్డు పనులు నాణ్యత లోపంతో దర్శనమిస్తున్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీధర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సదరు కాంట్రాక్టర్ నాణ్యత లోపం తో రోడ్డును నిర్మిస్తున్నాడని, నాణ్యత లోపంతోనే రోడ్డు పగుళ్లు తేలడం, అక్కడక్కడ కుంగిపోవడం జరుగుతుందని ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడి రోడ్డు పనులను పరిశీలించడం లేదని అన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు దీనిపై స్పందించి రోడ్డు పనులను పరిశీలించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -