నవతెలంగాణ – కాటారం
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం జాతర సమీపిస్తున్న తరుణంలో రోడ్డుకు అధికారులు మాత్రం మరమ్మత్తులకు పూనుకోవడం లేదు. జాతీయ రహదారికి ఇరువైపులా పొదలు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ఉన్నాయి. జాతరకు వెళ్లే భక్తులకు ప్రమాదం కూడా పొంచి ఉంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నోటీసులు ఇచ్చినప్పటికీ అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మేడిపల్లి సర్పంచి గడవేన పవిత్ర దేవేందర్ యాదవ్, కార్యదర్శి చాగంటి రాకేష్ తమ సొంత నిధులతో మూడు రోజులపాటు జాతీయ రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగినటువంటి పిచ్చి మొక్కలను పొదలను చెత్తను పూర్తిస్థాయిలో తొలగించడం జరిగింది. మేడారం వెళ్లే భక్తులకు ప్రమాదాలు జరగకుండా ఆలోచన చేసి రోడ్డుకు ఇరువైపులా శుభ్రం చేసిన గ్రామపంచాయతీ సర్పంచి, కార్యదర్శి ని పలువురు అభినందిస్తున్నారు.
సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



