Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర: మాజీమంత్రి చర్లకోల

గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర: మాజీమంత్రి చర్లకోల

- Advertisement -

నవతెలంగాణ- మిడ్జిల్ 
గ్రామ అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర అని ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించినారని ,ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎలాంటి అవినీతి లేకుండా రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధిలో సర్పంచులు, ఉప ఉప సర్పంచులు వార్డు మెంబర్లు కలిసి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి  బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చర్ల కోల లక్ష్మారెడ్డి అన్నారు. బి.ఆర్.ఎస్ పార్టీ బలపరిచి గెలుపొందిన మండలంలోని వివిధ గ్రామాలలో గెలుపొందిన సర్పంచ్లకు ఆదివారం కంచన పల్లి గ్రామంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కంచనపల్లి సర్పంచ్ మహేశ్వరి మల్లేష్  అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ  అబద్ధాలతో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినంక ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రజా ప్రభుత్వానికి ప్రజలే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని అన్నారు. అధికారంలోకి వచ్చే రెండు సంవత్సరాలు అయినా ఏ ఒక్క గ్రామంలో అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రామాలలో అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలే కనిపిస్తున్నాయని వివరించారు. ప్రజలు మోసపోతే గోసపడతారని కెసిఆర్ ముందే చెప్పారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. 

అనంతరం నూతన సర్పంచులను పూలమాలతోని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, చంద్రయ్య గౌడ్, గోపాల్ ముదిరాజ్, నాయకులు బాలు, చెన్నయ్య, శేఖర్ రెడ్డి, జంగయ్య, ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -