వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన మోడీ
గాంధీనగర్ : ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్ రాజకీయ స్థిరత్వం, సుస్థిరతతో ఉందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలోనే వేగంగా అభి వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అన్నారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తుందని వెల్లడించారు. ప్రస్తుత సమయంలో మౌలిక సదుపాయాలతో పాటు, పరిశ్రమలకు సిద్ధంగా ఉన్న కార్మిక శక్తి అత్యంత అవసరమని ఆయన అభిప్రా యపడ్డారు. ఆదివారం గుజరాత్ కఛ్‌లో ఏర్పాటు చేసిన గుజరాత్ ప్రాంతీయ సద స్సును ప్రారం భించిన అనంతరం ప్రసం గించారు.
‘ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం భారత ప్రగతిపై ప్రపంచ వ్యాప్తంగా ఆశలు పెట్టుకున్నాయని స్పష్టమవుతోంది. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని ప్రధాని చెప్పారు.
ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా భారత్‌లో మాత్రం స్థిరత్వం
- Advertisement -
- Advertisement -



