Monday, January 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందేశం బాగుండాలంటే మోడీని గద్దె దించాలి

దేశం బాగుండాలంటే మోడీని గద్దె దించాలి

- Advertisement -

– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌
– ఖమ్మం రూరల్‌లో జీపుజాతా ప్రారంభం
నవతెలంగాణ-ఖమ్మంరూరల్‌

దేశం శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయరంగాల్లో అభివృద్ధి చెందాలన్నా.. ప్రజలంతా సుఖసంతో షాలతో ఉండాలన్నా ప్రధాని మోడీని గద్దె దించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. అఖిల భారత రైతు సంఘం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, అఖిల భారత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంరూరల్‌ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామంలో ఆదివారం జీపుజాతాను సుదర్శన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ అధికారం చేపట్టిన 11 ఏండ్లలో కార్మిక, కర్షక రంగాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తున్నాడని విమర్శించారు. మధ్యతరగతి, పేద ప్రజలు గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని కాలంలో వారిని ఉపాధి హామీ చట్టం ఆదుకుందని, ఇప్పుడు ఆ పేదల పొట్ట కొట్టేందుకు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మోడీ ప్రభుత్వం వీబీ జీ రామ్‌ జీ పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చి.. ప్రయివేటీకరిం చేందుకు ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. పార్టీలకతీతంగా కార్మికులు, కర్షకులు, మహిళలు, యువకులు ఏకమై మతోన్మాద బీజేపీకి తగురీతిలో బుద్ధి చెప్పాల న్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్‌, వ్యకాస జిల్లా అధ్యక్షకార్యదర్శులు మెరుగు సత్యనారా యణ, పొన్నం వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్యాణం వెంకటేశ్వర రావు, తుమ్మ విష్ణు, సంఘాల నాయకులు బండి రమేష్‌, యర్రా శ్రీనివాసరావు, నండ్ర ప్రసాద్‌, పిన్నింటి రమ్య, షేక్‌ బషీరుద్దీన్‌, వడ్లమూడి నాగేశ్వరరావు, వేగనాటి విజయకుమార్‌, అరేంపుల రమాదేవి, కొమ్ము శ్రీను, అంగిరేకుల నరసయ్య, పెరుమళ్ళపల్లి మోహన్‌రావు, నేర్సుల వెంకటేష్‌, కొత్తపల్లి వెంకన్న, వీరన్న, వరకుమార్‌, వెంకటయ్య, ప్రసాద్‌, చిన్న బాబు, ముత్తయ్య, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -