Monday, January 12, 2026
E-PAPER
Homeజాతీయంలైంగికవేధింపుల కేసులో పాలక్కాడ్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌

లైంగికవేధింపుల కేసులో పాలక్కాడ్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌

- Advertisement -

తిరువనంతపురం : పాలక్కాడ్‌ ఎమ్మెల్యే, యువజన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ మమ్‌కూటథిల్‌ను అరెస్ట్‌ చేసినట్టు సీనియర్‌ పోలీసులు ఆదివారం తెలిపారు. షోరనూర్‌ డీవైఎస్‌పీ నేతృత్వంలోని పోలీస్‌ బృందం శనివారం అర్థరాత్రి ఆయనను పాలక్కాడ్‌లోని ఒక హోటల్‌ నుంచి అదుపులోకి తీసుకున్నామని అన్నారు. హోటల్‌ కేపీఎం రీజన్స్‌లో ఆయన బస చేసిన గదిని సీజ్‌ చేశామని అన్నారు. ఆధారాలను సేకరించడంలో భాగంగా దర్యాప్తు బృందం ఆయన ల్యాప్‌టాప్‌ను, మొబైల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. విచారణ,మెజిస్రేట్‌ ఎదుట హాజరుపరిచేందుకు ఆయనను పథనంతిట్ట తీసుకువెళ్లినట్టు తెలిపారు. ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్‌ మమ్‌కూటథిల్‌పై మరో ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో అరెస్ట్‌ నుంచి మధ్యంతర రక్షణ కూడా పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -