బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్
నవతెలంగాణ- కంఠేశ్వర్
వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. స్వామి వివేకానందుడు యువతకు ప్రేరణ అని, లేచి నిలబడు, లక్ష్యం సాధించే వరకు ఆగకు అనే ఆయన సందేశం మనలో ఆత్మవిశ్వాసం నింపుతుందన్నాడు. కష్టాలు భయపడకుండా, శ్రమను ఆయుధంగా మార్చుకుంటే విజయం తప్పక సాధ్యమని ఆయన బోధించిన సూత్రాలను నేటి యువత పాటించాలని నేటి యువత డ్రగ్స్ కు మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, కార్యనిర్వాహక అధ్యక్షులు కొట్టాల రామ కృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వివేకానంద ఆశయాలను కొనసాగిద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



