నవతెలంగాణ – ఆలేరు టౌన్
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నవతెలంగాణ దినపత్రిక పనిచేస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో సోమవారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద, నవతెలంగాణ దినపత్రిక ఆలేరు రిపోర్టర్ యేలుగల కుమారస్వామితో కలిసి 2026 క్యాలెండరుని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యపరచడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నవతెలంగాణ దినపత్రికలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న బాధ్యులకు, జర్నలిస్టులకు నూతన సంవత్సర, భోగి ,సంక్రాంతి , కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు ఎంఏ ఎజాస్, కొండరాజు వెంకటేశ్వరరాజు, మార్కెట్ డైరెక్టర్ చిలుక కిష్టయ్య, ఎగ్గిడి యాదగిరి, కొల్లూరు సర్పంచ్ జి దశరథ, నాయకులు ఐనాల మహేందర్ రెడ్డి, చింతలపాని శ్రీనివాస్ రెడ్డి, కందగట్ల నరేందర్, భీమ గాని సంతోష్, మోతే తిరుపతి, కృష్ణ, కె నర్సింలు తదితరులు పాల్గొన్నారు.



