Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్
ప్రభుత్వం పేద ప్రజలకు తినడానికి రేషన్ బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తే కొంతమంది అక్రమార్కులు వ్యాపారంగా మారుస్తూ విక్రయిస్తున్నారని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస అన్నారు. సోమవారం రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి సమీపంలో సీసీ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రఘునాథ్ పల్లి నుంచి వడ్డేపల్లికి తరలిస్తున్న డిసిఏం వాహనాన్ని తనిఖీ చేయగా బియ్యం తరలిస్తుండగా డ్రైవరు బానోత్ శంకర్ నాయక్ అదుపులోకి తీసుకొని వాహనం పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేపట్టగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా సోమవారం అట్టి బియ్యం తనిఖీ చేసి రేషన్ బియ్యంగా నిర్ధారించారు. డీసీఎం వాహనంలో ఉన్న 52 క్వింటాళ్ల బియ్యం గోదాంకు తరలించారు.

పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రాజిరెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పేద ప్రజల గురించి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది వారి స్వార్థం, స్వలాభం గురించి ప్రజల దగ్గర తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని ఎక్కువ రేటుకు వ్యాపారస్తులకు డబ్బులు సంపాదిస్తున్నారని, అలాంటి వారిపై జిల్లాలో గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్రమంగా పిడిఎస్ రేషన్ బియ్యం విక్రయించడం  ఈసీ1955 చట్టం సెక్షన్ 7 ప్రకారం నేరం అన్నారు. కాబట్టి మేకలగూడ గ్రామానికి చెందిన డ్రైవర్ బానోతు శంకర్ నాయక్, బియ్యం కొనుగోలు చేసిన శ్రీకాంత్ నాయక్ ల పై 6 (ఏ) కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం రేషన్ బియ్యం కొనుగోలు చేసిన, ఇతరులు అమ్మిన, అక్రమంగా రవాణా చేసిన, పేద ప్రజల పొట్టకొట్టి అక్రమ వ్యాపారం చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న సమాచారం ఉంటే  డయల్ 100, పోలీసులకు సమాచారం  అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -