Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భవిష్యత్తులో ప్రజా పోరాటాలకు సిద్ధం 

భవిష్యత్తులో ప్రజా పోరాటాలకు సిద్ధం 

- Advertisement -

– అన్ని వర్గాల నుండి విశేష స్పందన 
– ఊరు వాడ తిరిగి ప్రజల్లో చైతన్యం 
– ముగిసిన జీపు జాత ప్రచారం 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు భవిష్యత్తులో ప్రజా పోరాటాలు చేసేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక, విద్యుత్ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జీపు జాత ప్రచారం మిర్యాలగూడ నియోజకవర్గంలో సోమవారం ముగిసింది. ఈనెల 7న మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభమైన జీపు జాత నియోజకవర్గంలోని మిర్యాలగూడ మండలంలోని 46 గ్రామాలలో వేమూలపల్లి మండలంలో 13 గ్రామాలలో, దామచర్ల లో 35 అడవిదేవులపల్లిలో 13 గ్రామాలలో, మిర్యాలగూడ పట్టణంలో 48 వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ రైతాంగ, కార్మిక ,వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలపై పాటల ద్వారా ప్రజలకు వివరించారు. బిజెపి ప్రభుత్వం రైతులకు కార్మికులకు వ్యవసాయ కూలీలలకు చేస్తున్న అన్యాయలను వివరించి చైతన్య పరిచారు. గ్రామాలలో జీపు జాత తిరుగుతుంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని గ్రహించి ఆందోళన చెందారు. జనం కోసం ఎర్రజెండా వచ్చిందని ఎర్రజెండా చేసే పోరాటాలకు తాము మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతులు కార్మికులు, వ్యవసాయ కూలీల కోసం జరిగే పోరాటాలలో తమ ముందుంటామని ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 19న నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే నిరసన ప్రదర్శన, ఆందోళన సభకు రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

కేంద్రం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, వి బి జి రాంజీ పేరును తొలగించి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ ఈ పథకానికి నిధులు పెంచి పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కోరారు. విద్యుత్తు రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవి రద్దు అయ్యేంతవరకు రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలను సమీకరించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. చివరి రోజు సోమవారం దామరచర్ల అడవి దేవులపల్లి మండలాలలో విస్తృత ప్రచారంతో జీపు జాత ముగిసింది. ఈ జీపు జాతలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పిలుట్ల సైదులు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి,బావాండ్ల పాండు, రైతు సంఘం నాయకులు గోవింద్ రెడ్డి, గోలి వెంకట్ రెడ్డి, రవి నాయక్, వినోద్ నాయక్, పాదూరి శశిధర్ రెడ్డి, రొండి శ్రీనివాస్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -