Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు

ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు

- Advertisement -

 నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
రాజపేట మండలం సోమారం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మనెమ్మ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడుతూ.. నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ సోమవారం ప్రజావాణిలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ పథకంలో పని చేయని వారికి పేర్ల మీద నకిలీ బిల్లులు సృష్టించి, వారు పని చేసినట్లుగా రికార్డులో నమోదు చేసి నిధులు డ్రా చేశారని ఆరోపించారు. అర్హులైన వారికి పని కల్పించకుండా తనకు ఇష్టం వచ్చిన వారికి పని కల్పిస్తున్నారని ఆరోపించారు. అందుకు సంబంధించిన వివరాలను సాక్షాలతో సహా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు జగన్మోహన్ రెడ్డి, జంగా బిక్షపతి, భూమకంటి గోదావరి, జంగ యాదగిరిలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -