Tuesday, January 13, 2026
E-PAPER
Homeజాతీయంమాజీ నేవీ చీఫ్‌కూ తప్పని 'సర్‌' కష్టాలు

మాజీ నేవీ చీఫ్‌కూ తప్పని ‘సర్‌’ కష్టాలు

- Advertisement -

మరిన్ని పత్రాలు చూపాలంటూ ఈసీ నోటీసులు
పనాజీ :
యుద్ధ వీరుడు, వీర చక్ర అవార్డు గ్రహీత, భారత నౌకాదళ మాజీ ప్రధానాధికారి అడ్మి రల్‌ అరుణ్‌ ప్రకాష్‌కు సైతం ‘సర్‌’ కష్టాలు తప్పలేదు. ఓటర్లుగా ధృవీ కరించుకోవడానికి అదనపు పత్రాలు సమర్పించాల్సిందిగా అరుణ్‌ ప్రకాష్‌కు, ఆయన భార్యకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పదవీ విరమణ అనంతరం అరుణ్‌ ప్రకాష్‌ గోవాలో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియ నడుస్తోంది. ఈసీ నోటీసులపై అరుణ్‌ ప్రకాష్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రెండు వేర్వేరు తేదీలలో హాజరు కావాల్సిందిగా నాకు, నా భార్యకు ఎన్నికల కమిషన్‌ నోటీసులు పంపింది. వాటికి మేము కట్టుబడి ఉండాల్సిందే. అయితే నోటీసులో ఉపయోగించిన భాష సంక్లిష్టంగా ఉంది. అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది’ అని తెలిపారు.
ఇంతకీ ఆ నోటీసులో ఏముం దంటే… ‘మీ శాసనసభ స్థానంలో సర్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మీరు సంతకం చేసి పంపిన ఎన్యూమరేషన్‌ పత్రం చేరింది. దానిని పరిశీలించాం. గతంలో చేపట్టిన సవరణ సందర్భంగా ఓటరు జాబితాలో మీ పేరు ఉన్నదని నిర్ధారించే వివరాలేవీ పూర్తి చేయలేదు’. ఈ నోటీసుపై అడ్మిరల్‌ స్పందిస్తూ ఇరవై సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేశానని, అప్పటి నుంచి నేటి వరకూ తాను ఎలాంటి ప్రత్యేక హక్కులు, అధికారాలు కోరలేదని, ఆ అవసరమూ లేదని చెప్పారు. తాను, తన భార్య సర్‌ పత్రాలు పూర్తి చేశామని, ఈసీ వెబ్‌సైటు లోని గోవా ముసాయిదా ఓటర్ల జాబితాలో కూడా తమ పేర్లు ఉన్నా యని తెలిపారు.
అయినప్పటికీ ఈసీ నోటీసులను గౌరవిస్తామని అన్నారు. తమ వద్దకు బీఎల్‌ఓ మూడు సార్లు వచ్చారని, అప్పుడే అదనపు సమాచారం కోరి ఉండ వచ్చునని చెప్పారు. అవసరమైన సమాచారం లేకుంటే సర్‌ పత్రా లను సవరించవచ్చునని తెలిపారు. తన వయస్సు 82 సంవత్సరాలని, భార్య వయసు 78 ఏండ్లని అంటూ తమను రెండు వేర్వేరు తేదీలలో హాజరు కావాలని అడిగారని, అందుకోసం 18 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉందని వివరించారు.
అడ్మిరల్‌కు ఇచ్చిన నోటీసుపై ప్రభుత్వ అధికారి ఒకరు స్పందిస్తూ చివరిసారిగా సవరణ జరిగిన 2002లో వారి వివరాలు లేవని చెప్పారు. ఎన్యూమరేషన్‌ పత్రంలో కొన్ని వివరాలు పూర్తి చేయలేదని, అందుకే నోటీసులు ఇచ్చామని అన్నారు. కాగాగత వారంలో కూడా నౌకాదళ మాజీ అధికారి, కార్గిల్‌ యుద్ధ వీరుడు, దక్షిణ గోవా ఎంపీ విరియాటో ఫెర్నాండెజ్‌కు ఇలాంటి నోటీసే ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -