మండల ఎంపీడీఓ క్రాంతికుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల పరిషత్ ఉద్యోగంతోపాటు వివిధ పదవుల్లో 35 సంవత్సరాలు సేవలందించి మండల సూపర్ డెంట్ గా ఉద్యోగ పదవి విరమణ పొందిన గంటి శ్రీరామమూర్తి సేవలు గొప్పవని మండల ఎంపీడీఓ క్రాంతికుమార్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యక్రమంలో ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ఎంపీడీఓ హాజరై మాట్లాడారు. మండల సూపర్ డెంట్ గా, ఇంఛార్జి ఎంపీడీఓ గా శ్రీరామూర్తి సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం భూపాలపల్లి జిల్లా పక్షాన అభినందన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మల్లిఖార్జున రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు యాదవ్, సతీష్, ఈజీఎస్ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
సూపరింటెండెంట్ శ్రీరామమూర్తి సేవలు గొప్పవి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



