Tuesday, January 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమాజీ సీఎం రోశయ్య సతీమణి మృతి

మాజీ సీఎం రోశయ్య సతీమణి మృతి

- Advertisement -

సంతాపం తెలిపిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌ / అమీర్‌పేట
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత కొనిజేటి రోశయ్య సతీమణి కొణిజేటి శివలక్ష్మి(86) కన్నుమూశారు. హైదరాబాద్‌ అమీర్‌పేటలోని తన స్వగృహంలో సోమవారం ఉదయం అనారోగ్య కారణాలతో ఆమె మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆమె నివాసానికి వెళ్లి మృతదేహంపై పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్‌ అమీర్‌పేట అధ్యక్షులు హన్మంతరావు, నాయకులు అశోక్‌ యాదవ్‌, ప్రవీణ్‌ రెడ్డి, కరుణాకర్‌ రెడ్డి, పీయూష్‌ గుప్తా, ఉత్తమ్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -