నవతెలంగాణ – కామారెడ్డి
నగరంలో ఫిట్‌నెస్, రన్నింగ్ సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన కామారెడ్డి ప్రమో రన్–2026 శనివారం స్థానిక ఇండిరా గాంధీ స్టేడియంలో తెలంగాణ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ప్రీతమ్, భాస్కర్ ఉప్పల్ల, కామారెడ్డి రన్ డైరెక్టర్ జ్యోత్స్న సమన్వయంతో కార్యక్రమం సజావుగా జరిగింది. గజ్వేల్ రన్నర్స్‌కు చెందిన నిఖిల్ రెడ్డి, జనార్ధన్‌తో పాటు ఆర్కే గ్రూప్ చైర్మన్ జైపాల్ కూడా నిర్వహణలో భాగమయ్యారు.
ఈ రన్‌లో 2కే ఫ్యామిలీ రన్, 5కే ఫన్ రన్, 10కే ప్రధాన రన్ విభాగాల్లో పెద్ద సంఖ్యలో యువత, కుటుంబాలు, ఫిట్‌నెస్ ఆసక్తిగల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్న వారికి టీ – షర్టులు, ఫినిషర్ మెడల్స్, అల్పాహారం తదితర సౌకర్యాలు అందించారు. ఈ కార్యక్రమానికి అవంతిక కన్స్ట్రక్షన్స్, మెడ్‌వన్ హాస్పిటల్స్, లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ సంస్థలు స్పాన్సర్లుగా సహకరించాయి. ఈ కార్యక్రమం ద్వారా నగర ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని, రన్నింగ్‌పై ఆసక్తి మరింత పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రమో రన్, జూన్ 7న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వద్ద నిర్వహించనున్న అవంతిక తెలంగాణ రన్–2026కు ముందుమాటగా నిర్వహించబడినట్లు వారు పేర్కొన్నారు.



