సాధారణంగా గ్రంథాలయం అనగానే మనకు నిశ్శబ్దంగా ఉండే గదులు, వరుసగా పేర్చిన పుస్తకాల అల్మారలు, అక్కడక్కడా చదువుకునే పాఠకులు మాత్రమే గుర్తుకు వస్తారు. గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాలను భద్రపరిచే ఒక స్టోర్ రూమ్ అనే భావన మనలో బలంగా నాటుకుపోయింది. కానీ ఫిన్‌ల్యాండ్‌లో పరిస్థితి పూర్తిగా దీనికి భిన్నం. అక్కడ గ్రంథలయాలు కేవలం పుస్తకాలను అప్పు ఇచ్చే కేంద్రాలు మాత్రమే కాదు. అవి ఒక సమాజ సజనాత్మకతను, నైపుణ్యాన్ని, జీవన ప్రమాణాలను పెంచే శక్తివంతమైన కేంద్రాలుగా మారాయి.
ఫిన్నిష్ ప్రజల జీవితాల్లో లైబ్రరీ అనేది ‘రెండవ ఇల్లు’ లేదా ‘పబ్లిక్ లివింగ్ రూమ్’. పుస్తకాలతో పాటు నిత్యజీవితంలో అవసరమయ్యే పనిముట్లు, అత్యాధునిక సాంకేతిక పరికరాలు, క్రీడా సామాగ్రిని కూడా అప్పుగా ఇస్తూ ఫిన్‌ల్యాండ్ ప్రపంచానికే ఒక కొత్త దారిని చూపిస్తోంది. గ్రంథాలయానికి ఒక నూతన భాష్యాన్ని, వినూత్న నిర్వచనాన్ని అందిస్తుంది.
షేరింగ్ ఎకానమీ
సొంతం చేసుకోవడం కంటే పంచుకోవడం మిన్న: నేటి వినియోగదారుల సమాజంలో మనం ఒక వస్తువును కేవలం ఒకటో రెండో సార్లు ఉపయోగించడానికి కొంటుంటాం. ఉదాహరణకు, ఇంట్లో ఏదైనా రిపేర్ చేయడానికి డ్రిల్లింగ్ మెషిన్ కొంటాం, కానీ దాని అవసరం ఏడాదిలో రెండు సార్లు మాత్రమే ఉంటుంది. మిగిలిన సమయమంతా అది మూలన పడి ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా డబ్బు వృథా చేయడమే కాకుండా, అనవసరమైన వస్తువుల ఉత్పత్తి వల్ల పర్యావరణానికి కూడా హాని చేస్తుంది. ఫిన్‌ల్యాండ్ లైబ్రరీలు ఈ సమస్యకు షేరింగ్ (పంచుకోవడం) అనే అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నాయి. డ్రిల్లింగ్ మెషిన్లు, కుట్టు మిషన్లు, కార్పెంటరీ టూల్స్, 3ణ ప్రింటర్ల వంటి ఖరీదైన పరికరాలను ప్రతి ఒక్కరూ కొనాల్సిన అవసరం లేకుండా లైబ్రరీలోనే అందుబాటులో ఉంచుతున్నారు. దీనివల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలగడమే కాకుండా, వస్తువుల పునర్వినియోగం పెరిగి వ్యర్థాలు తగ్గుతాయి. ‘ఓనింగ్’ (సొంతం చేసుకోవడం) కంటే ‘షేరింగ్’ (పంచుకోవడం) గొప్పదనే ఉన్నతమైన భావనను ఇక్కడి వ్యవస్థ ప్రజల డీఎన్‌ఏలో ఇంకిపోయేలా చేస్తోంది.
మేకర్‌స్పేస్‌లు
సరికొత్త ఆవిష్కరణల వేదికలు: ఫిన్‌ల్యాండ్ లైబ్రరీలు ఇప్పుడు అత్యాధునిక ‘మేకర్‌స్పేస్‌లు’గా (Makerspaces) రూపాంతరం చెందాయి. ఇక్కడ ప్రజలు తమ ఆలోచనలకు ప్రాణం పోయవచ్చు. ఒక సామాన్య పౌరుడు తన ఇంట్లో విరిగిపోయిన వస్తువును రిపేర్ చేసుకోవడానికి ఇక్కడి టూల్స్ వాడవచ్చు, లేదా ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తన కొత్త ఆవిష్కరణకు సంబంధించిన ప్రోటోటైప్‌ను 3ణ ప్రింటర్ సహాయంతో ఉచితంగా తయారు చేయవచ్చు. ఈ మేకర్‌స్పేస్‌లలో శిక్షణ పొందిన సిబ్బంది, వాలంటీర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండి, కొత్త పరికరాలను ఎలా వాడాలో నేర్పిస్తారు. ఇది కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడమే కాకుండా, సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని, స్వయం సమద్ధిని పెంపొందిస్తోంది. ప్రజలు తమకు కావలసిన వస్తువులను తామే తయారు చేసుకోవడం లేదా రిపేర్ చేసుకోవడం వల్ల ‘మేక్ ఇన్ ఫిన్‌ల్యాండ్’ అనే భావన అట్టడుగు స్థాయి నుండి బలంగా తయారవుతోంది.
సామాజిక సమానత్వం, సస్టైనబిలిటీ
ఈ లైబ్రరీ నమూనా సామాజిక సమానత్వానికి ఒక గొప్ప ఉదాహరణ. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు లేదా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా ధనికులతో సమానంగా అత్యాధునిక సాంకేతికతను, క్రీడా పరికరాలను పొందగలుగుతున్నారు. ఉదాహరణకు శీతాకాలంలో అవసరమయ్యే ఖరీదైన జాౖట్లు, టెంట్లు లేదా క్యాంపింగ్ గేర్‌లను కేవలం లైబ్రరీ కార్డుతో ఉచితంగా పొందవచ్చు. దీనివల్ల సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలు తగ్గి, ఐక్యత పెరుగుతుంది. వస్తువులను పారేయకుండా వాటిని రిపేర్ చేసి మళ్లీ వాడటం (Mend instead of throw away) అనే సంస్కృతిని ఇది ప్రోత్సహిస్తోంది. ఇది భూమిపై పడుతున్న కాలుష్య భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ వనరులు ప్రజలందరికీ సమానంగా అందాలనే ప్రజాస్వామ్య సూత్రానికి ఇది పరాకాష్ట.
ఊది (ఉశీసఱ)
భవిష్యత్ గ్రంథాలయానికి ఒక నమూనా: హెల్సింకీ సెంట్రల్ లైబ్రరీ ‘ఊది’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో ఒక లక్షకు పైగా పుస్తకాలు ఉన్నప్పటికీ, అవి కేవలం మూడవ అంతస్తుకే పరిమితం. మిగిలిన అంతస్తుల్లో సినిమా థియేటర్లు, రికార్డింగ్ స్టూడియోలు, గేమింగ్ రూమ్స్, వర్క్‌షాప్‌లు ఉన్నాయి. పాత కాలపు క్యాసెట్లు లేదా వీడియో టేపుల్లో ఉన్న జ్ఞాపకాలను డిజిటల్ రూపంలోకి మార్చుకోవడానికి ఇక్కడ ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ఇది కేవలం చదువుకునే చోటు మాత్రమే కాదు, ప్రజలు కలిసి చర్చించుకునే, కొత్త విషయాలు నేర్చుకునే ఒక సామాజిక సంగమ క్షత్రం. భవిష్యత్ తరాల అవసరాలను దష్టిలో ఉంచుకుని నిర్మించిన ఈ కట్టడం, గ్రంథలయం అంటే కేవలం పుస్తకాల భాండాగారం కాదు, అది ఒక సజీవ సమాజం అని నిరూపిస్తోంది.
విద్యా వ్యవస్థ – గ్రంథలయాల అనుబంధం అసలు రహస్యం: ఫిన్‌ల్యాండ్ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండటానికి ప్రధాన కారణం అక్కడి శక్తివంతమైన గ్రంథలయాలే. విద్యా వ్యవస్థ, గ్రంథలయాల మధ్య ఉన్న అనుబంధం గురించి కొన్ని ముఖ్య అంశాలు.
ప్రాక్టికల్ లెర్నింగ్ (ఆచరణాత్మక అభ్యాసం): ఫిన్నిష్ విద్య కేవలం థియరీకి పరిమితం కాదు. స్కూల్లో నేర్చుకున్న విషయాలను లైబ్రరీలోని మేకర్‌స్పేస్‌లలో విద్యార్థులు స్వయంగా ప్రయోగం చేసి చూస్తారు. ఫిజిక్స్ క్లాసులో విన్న సర్క్యూట్ల గురించి లైబ్రరీలోని ఎలక్ట్రానిక్స్ ల్యాబ్‌లో ప్రాక్టికల్ చేస్తారు.
24/7 వనరుల అందుబాటు: అనేక లైబ్రరీలు డిజిటల్ కార్డుల ద్వారా 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. సెల్ఫ్-సర్వీస్ టెక్నాలజీ వల్ల విద్యార్థులు తమకు వీలైన సమయంలో వచ్చి ప్రాజెక్టులు చేసుకోవచ్చు. గ్రంథలయ సమయాలు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా చాలా సరళంగా ఉంటాయి.
నిరంతర అభ్యసనం Lifelong Learning): యునెస్కో (UNESCO) పేర్కొన్న విధంగా, అభ్యసనం అనేది పాఠశాల దశతో ముగిసిపోకూడదు. ఇది పుట్టినప్పటి నుండి మరణం వరకు సాగే ఒక నిరంతర ప్రక్రియ. ఫిన్లాండ్ లైబ్రరీలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పెద్దవారు కూడా ఇక్కడ కొత్త విషయాలు నేర్చుకుంటారు.
సమాచార విశ్లేషణ: గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లలో వచ్చే సమాచారం కంటే, ధవీకరించబడిన పుస్తకాలు, జర్నల్స్ లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి. ఇది విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనను (Critical Thinking)) పెంచుతుంది.
రీడింగ్ డాగ్స్: పిల్లల్లో పఠనాసక్తిని పెంచడానికి ఫిన్‌ల్యాండ్ ‘రీడింగ్ డాగ్స్’ (Reading Dogs)) అనే పద్ధతిని ప్రవేశపెట్టింది. పిల్లలు కుక్కల ముందు కూర్చుని పుస్తకాలు చదువుతారు. కుక్కలు ఎటువంటి తీర్పు ఇవ్వకుండా (Non judgmental)) శ్రద్ధగా వింటాయి. కాబట్టి, పిల్లలు తప్పులు దొర్లుతాయనే భయం లేకుండా ఉత్సాహంగా చదువుతారు.ఇది వారి భాషా నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇప్పుడు కుక్కలే కాకుండా పోనీ గుర్రాలు, ఆవులు కూడా ఈ సేవలలో భాగస్వామ్యం అవుతున్నాయి. జంతువులతో కలిసి చదవడం వల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గి, గ్రంథలయానికి రావడం ఒక సరదాగా మారుతుంది. ఇది విద్యార్థుల మధ్య పఠన సంస్కృతిని (Reading Culture) బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఖచీజుూజఉ, నిరంతర అభ్యసన సంస్కతి: యునెస్కో తన నివేదికలలో ‘లెర్నింగ్ టు బి’, ‘లెర్నింగ్ టు నో’ అనే అంశాలను నొక్కి చెబుతుంది. ఫిన్‌ల్యాండ్ ఈ సూత్రాలను అక్షరాలా అమలు చేస్తోంది. అక్కడి గ్రంథలయాలు కేవలం విద్యార్థులకే కాదు, ఉపాధ్యాయులకు, ఫ్యాకల్టీ సభ్యులకు కూడా నిరంతర పరిశోధనా కేంద్రాలుగా పనిచేస్తాయి. అక్కడ లైబ్రరీ సమయాలు (Library
Timings ), అందుబాటులో ఉన్న వనరులు (Available Resources)) విద్యా వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తాయి. ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనా పద్ధతులను మెరుగుపరుచుకోవడానికి లైబ్రరీలోని అత్యాధునిక డిజిటల్ వనరులను వాడుకుంటారు. దీనివల్ల బోధనలో నాణ్యత పెరుగుతుంది. పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాల మధ్య ఒక విడదీయలేని సమన్వయం అక్కడ కనిపిస్తుంది.
వాస్తుశిల్ప కళాఖండాలు: ఫిన్‌ల్యాండ్ గ్రంథాలయాలు కేవలం సేవలకు మాత్రమే కాదు, వాటి నిర్మాణ శైలికి కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందాయి.
హెల్సింకీ సెంట్రల్ లైబ్రరీ ఊది: దీని ఆధునిక డిజైన్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. కిర్కోనుమ్మి ఫ్యిరి: దీని ప్రశాంతమైన వాతావరణం పఠనానికి ఎంతో అనువైనది.
రోవానియెమి లైబ్రరీ: ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ అల్వర్ ఆల్టో దీనిని అద్భుతంగా రూపొందించారు. ఈ కట్టడాలు ఫిన్నిష్ సమాజం జ్ఞానానికి, కళలకు, మానవ వికాసానికి ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనాలు.
భారతదేశానికి, ప్రపంచానికి ఒక పాఠం: ఫిన్‌ల్యాండ్ గ్రంథాలయ వ్యవస్థ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది: జ్ఞానం అనేది కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉండదు. అది అనుభవంలో, పనిముట్లలో, పంచుకోవడంలో ఉంటుంది. లైబ్రరీ అనేది సమాజంలోని ప్రతి వ్యక్తికి చెందిన ఆస్తి. అది సామాజిక అడ్డంకులను తొలగించి, అందరికీ సమాన అవకాశాలను కల్పించే ఒక వేదిక. భారతదేశం వంటి దేశాల్లో కూడా కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, వత్తి నైపుణ్యాలు, క్రీడలు, ఆధునిక సాంకేతికతను జోడించి ఇలాంటి వినూత్న లైబ్రరీ మోడళ్లను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విద్యార్థుల్లో, ఫ్యాకల్టీ సభ్యులలో పఠన సంస్కతిని, పరిశోధనా జిజ్ఞాసను పెంచడానికి ఫిన్‌ల్యాండ్ అనుసరిస్తున్న 24/7 రిసోర్స్ య్సాౖస్ మోడల్ మనకు ఆదర్శం. ఒక లైబ్రరీ కార్డుతో ప్రపంచాన్ని మార్చవచ్చని, జీవన నాణ్యతను పెంచుకోవచ్చని ఫిన్‌ల్యాండ్ నిరూపించింది. ఇది ప్రతి దేశం అనుసరించాల్సిన నిజమైన ‘ఫిన్నిష్ మోడల్’.
గ్రంథాలయాలు కేవలం గతానికి సంబంధించిన జ్ఞాపకాలు కావు, అవి భవిష్యత్తును నిర్మించే కర్మాగారాలు. మన దేశంలోని గ్రంథలయాలను కూడా ఇలాంటి ‘లైవ్ లెర్నింగ్ సెంటర్లు’గా మార్చినప్పుడే మనం నిజమైన జ్ఞానాధారిత సమాజాన్ని నిర్మించగలం.
- డా|| రవికుమార్ చేగొని, 9866928327



