నవతెలంగాణ-హైదరాబాద్: టీవీకే అధినేత విజయ్ చెన్నైలోని టీవీకే కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా విజయ్ను శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద శక్తిగా నిలిచించిన విషయం తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 స్థానాల దూరంలోనే ఉంది. అయితే విజయ్‌కు మద్దతిచ్చేందుకు చిన్న పార్టీలు సన్నద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే.స్టాలిన్ రాజీనామా చేయగా.. గవర్నర్ ఆమోదించారు. ఇక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు విజయ్ లేఖ రాశారు.
శాసనసభాపక్ష నాయకుడిగా టీవీకే అధినేత విజయ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



