Tuesday, January 20, 2026
E-PAPER
Homeఖమ్మంమండలానికి ఏడుగురు లైసెన్స్ సర్వేయర్ లు

మండలానికి ఏడుగురు లైసెన్స్ సర్వేయర్ లు

- Advertisement -

– ముగ్గురు విధుల్లో చేరిక
– తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలానికి కేటాయించిన ఏడుగురు లైసెన్స్ సర్వేయర్ ల్లో సోమవారం ముగ్గురు విధుల్లో చేరినట్లు తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ తెలిపారు. రెవిన్యూ శాఖ ను బలోపేతం చేయడం, పాలనలో పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయి సిబ్బందిని నియమిస్తూ వస్తుంది. ఇప్పటికే జీపీఓ లను నియమించిన ప్రభుత్వం ప్రస్తతం లైసెన్స్ సర్వేయర్ లను నియమించింది. ఈ సిబ్బంది మ్యాపింగ్ లేని భూములకు ముందుగా మ్యాపింగ్ ఇచ్చి,అనంతరం అవసరం అయిన భూముల్లో రీ సర్వే చేపడతారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ నాగరాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -