Tuesday, January 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవియ‌త్నాంలో ప్రారంభ‌మైన కమ్యూనిస్ట్‌పార్టీ జాతీయ మహాసభ‌లు

వియ‌త్నాంలో ప్రారంభ‌మైన కమ్యూనిస్ట్‌పార్టీ జాతీయ మహాసభ‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వియత్నాం కమ్యూనిస్ట్‌పార్టీ (సీపీవీ) తన 14వ జాతీయ మహాసభలను మంగళవారం ప్రారంభించింది. దేశ రాజధాని హనోయిలోని నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నేడు ప్రారంభమైన ఈ సమావేశాలు జనవరి 25 వరకు జరగనున్నాయి. ప్రతి ఐదేళ్లకొకసారి జరిగే ఈ సమావేశాలు..భవిష్యత్తు కోసం దేశ కొత్త నాయకత్వం, ఆర్థిక అంశాలపై రోడ్ మ్యాప్‌ను నిర్ణయించనున్నాయి.

దేశవ్యాప్తంగా 5,60,000కు పైగా సీపీవీ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం 1,568మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. పార్టీ కేంద్ర కమిటీకి సుమారు 200మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. అలాగే 17 నుండి 19 మంది సభ్యులతో కూడిన పొలిట్‌బ్యూరోను నియమిస్తుంది. వీరి నుండి వియత్నాం రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేస్తారు. 13వ పార్టీ కేంద్ర కమిటీ రాజకీయ నివేదిక మరియు గత నాలుగు దశాబ్దాలుగా వియత్నాం సోషలిస్ట్‌ ఆధారిత పునరుద్ధరణ ప్రక్రియ, సైద్ధాంతిక మరియు ఆచరణాత్మక అంశాల మూల్యాంకనంతో సహా కీలక పత్రాలను ప్రతినిధులు చర్చించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -