- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నేపాల్‌లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల బరిలో నలుగురు మాజీ ప్రధానులు, ముగ్గురు మేయర్లు నిలిచారు. మార్చి 5న జరగనున్న ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మంగళవారం ముగిసింది. మాజీ ప్రధానులు కేపీ శర్మ ఓలి, పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’, మాధవ్ కుమార్, బాబురామ్ భట్టరాయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఖట్మండూ మెట్రోపాలిటన్ సిటీ మాజీ మేయర్ బాలేంద్ర షా కూడా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా ఝాపా–5 నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 165 సీట్లకు 3,500 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, వీరిలో 400 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. సుమారు 1.9 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
- Advertisement -



