Thursday, January 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఈయూ దేశాలపై టారిఫ్‌లు.. ట్రంప్‌ కీలక నిర్ణయం

ఈయూ దేశాలపై టారిఫ్‌లు.. ట్రంప్‌ కీలక నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గ్రీన్‌లాండ్‌ విషయంలో తమకు మద్దతు తెలపని ఈయూ దేశాలపై 10 శాతం టారిఫ్‌లు విధిస్తానన్న యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ వెనక్కి తగ్గారు. ఫిబ్రవరి 1 నుంచి టారిఫ్‌లు అమలు చేస్తామన్న హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రుట్టేతో ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌, ఆర్కిటిక్‌  ప్రాంత భవిష్యత్తు ఒప్పందానికి ఫ్రేమ్‌వర్క్‌ సిద్ధమైందని వెల్లడించారు. ఈ నిర్ణయం అమెరికాకే కాకుండా నాటో మిత్రదేశాలన్నిటికీ లాభదాయకమని తెలిపారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -