సీఎం చేతులమీదుగా రూ.లక్ష నగదు అందుకున్న ప్రిన్స్ పాల్ విజయ దేవి
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్రంలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన కళాశాలలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు పురస్కారాన్ని అందజేస్తోంది.ఇందులో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలలో కళాశాల పేరును రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపినందుకు గాను తాడిచర్ల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి విజయ దేవి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు ప్రారంభంలో భాగంగా సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కళాశాల తరఫున నగదు ప్రోత్సాహకంగా లక్ష రూపాయలు చెక్కును అందుకున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కు కళాశాల అధ్యాపకులు,సిబ్బంది,విద్యార్థులు,తల్లిదండ్రులు అభినందనలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.అలానే విద్యా వారోత్సవాల్లో రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా తాడిచర్ల కళాశాలలోని అధ్యాపకులు విద్యార్థుల కొరకు కాన్వాసింగ్ కౌన్సిలింగ్,మోటివేషన్ నిర్వహించారు.
ఉత్తమ బోధనకు తాడిచెర్ల కళాశాలకు నగదు ప్రోత్సాహకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



