Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం కప్ క్లస్టర్ క్రీడలు ఘనంగా నిర్వహణ

సీఎం కప్ క్లస్టర్ క్రీడలు ఘనంగా నిర్వహణ

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండల సీఎం కప్‌లో భాగంగా శారాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం క్లస్టర్ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి రాజు అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథులుగా ఆలేరు ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్,గ్రామ సర్పంచ్ కంతి మధు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుందని తెలిపారు.

ఈ క్లస్టర్ స్థాయి పోటీల్లో దాదాపు ఆరు గ్రామపంచాయతీల నుంచి 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.వివిధ క్రీడా విభాగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పోటీపడ్డారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మి, ఉప సర్పంచ్ దూడల శ్రీధర్, మార్కెట్ డైరెక్టర్ చిలుకు కిష్టయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు గడసంతల మధుసూదన్, మాదానుజోసఫ్, కవిత, రీటా, వసంతకుమారి, పాఠశాల ఉపాధ్యాయులు సంజీవరెడ్డి, రాజేశ్వరరావు,కృపాకర్,దయాకర్,శ్రీనివాస్,కాంతారావు,సంగీత, నసిరుద్దీన్,రామ్ చందర్,దివాకర్, ఎలేంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -