నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో అధ్యాపకులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంటర్మీడియట్ కమీషనర్ ద్వారా కాలేజీలో జరుగుతున్న అభివృద్ధి పనులను, లాబ్స్, లైబ్రరీ, కళాశాల గదులను తిరిగి చూపించారు. కళాశాలలో విద్యను అభ్యసించి కొలువులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
కళాశాల అధ్యాపకులు మెగా టీచర్ మీటింగ్ కి వచ్చిన తల్లిదండ్రులకు విద్యార్థుల హాజరు శాతం వారి యొక్క ఫలితాలను ఫలితాల గురించి అధ్యాపకులు వివరించారు. వార్షిక పరీక్షలలో ఏ విధంగా సన్నద్ధం కావాలో సబ్జెక్టు వారీగా విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అనసూయ మాట్లాడుతూ కళాశాలలో జరగబోయే వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఏ విధంగా సన్నార్థం సన్నద్ధం కావాలో వివరించారు. కళాశాలకు 100% ఫలితాలు తీసుకురావాలని కళాశాల అధ్యాపక బృందం, తల్లిదండ్రులు సహకారంతో సాధ్యం అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం ఉన్నారు.



