Saturday, January 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుCorruption: డేంజర్ జోన్ పరిహారం ఇప్పిస్తామంటూ అక్రమ వసూల్?

Corruption: డేంజర్ జోన్ పరిహారం ఇప్పిస్తామంటూ అక్రమ వసూల్?

- Advertisement -

సోషల్ మీడియాలో వైరల్

నవతెలంగాణమల్హర్ రావు

తాడిచెర్లలోని కాపురం ఓసీపీ బ్లాక్-1కు డేంజర్ జోన్లో 500 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్లకు పరిహారం,ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇప్పిస్తామంటూ కొందరు ఇంటికి రూ. 3 వేల నుంచి రూ.5 వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లుగా గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరలవుతున్న విషయం తెలిసిందే. డేంజర్ జోన్లో నివసిస్తున్న భూ నిర్వాసితులు మాత్రం నిత్యం దుమ్ముధూలితో ఇబ్బందులకు గురవుతూ, బ్లాస్టింగ్ దెబ్బలతో ఇండ్లు భారీగా పగుళ్లు తేలడంతో భయాందోళనలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇండ్ల,భూముల పరిహారం ఎప్పుడెప్పుడు వస్తుందోని ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు చోటమోటా నాయకులు మాత్రం డేంజర్ జోన్ ను ఒక రాజకీయ వేదికగా మలుచుకుంటూ తాము పరిహారం,ప్యాకేజి ఇప్పిస్తామంటూ అక్రమ, వసూళ్లకు పాల్పడటం ఒకవైపు అయితే, లేదు తాము ఒక్కరూపాయి తీసుకోకుండా ఇండ్ల, భూముల పరిహారం ఇప్పిస్తాము, పరిహారం వచ్చాక ఇంత కమిషన్ ఇవ్వాలని మరి కొందరు దళారులు ప్రలోభాలకు గురిచేయడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలో కాపురం గ్రామంలో పాత, కొత్త, లోకల్, నాన్ లోకల్ ఇండ్లకు పరిహారం, ప్యాకేజి ఇప్పిస్తామంటూ కొందరు చోటామోటా నాయకులు ఇంటికి రూ.1లక్ష నుంచి,రూ.1.20 లక్షలు అక్రమ వసూళ్లకు పాల్పడిన విషయం విదితమే.ఆ బాగోతం సైతం సోషల్ మీడియాలో వైరలైoది. చివరకు అప్పటి ప్రభుత్వం,జెన్కో కంపెనీ కాపురం భూ నిర్వాసితులకు ఇండ్ల పరిహారం,ప్యాకేజి చెల్లించిన విషయం తెలిసిందే. రాజు తలసుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లుగా ప్రభుత్వం తలచుకుంటే డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లకు, భూములకు పరిహారం, ప్యాకేజి రావడం మాత్రం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏదిఏమైనా డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను, భూములను త్వరగా సేకరించి పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇవ్వాలని నిర్వాసితులు ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -