Friday, May 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఒమన్ తీరంలో భారత నౌకపై దాడి..మునిగిన 'హాజీ అలీ'

ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి..మునిగిన ‘హాజీ అలీ’

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఒమన్ జలాల్లో భారత జెండాతో ప్రయాణిస్తున్న ‘హాజీ అలీ’ అనే నౌక దాడికి గురై సముద్రంలో మునిగిపోయింది. అయితే, నౌకలోని 14 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాణిజ్య నౌకలపై జరిగిన ఈ దాడి ‘అంగీకారయోగ్యం కాదు’ అని తీవ్రంగా ఖండించింది.

సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు సరుకుతో వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దాడి వల్ల నౌకలో మంటలు చెలరేగి, అది సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. వెంటనే స్పందించిన ఒమన్ కోస్ట్ గార్డ్ నౌకలోని 14 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించి సమీపంలోని దిబ్బా పోర్టుకు తరలించారు.

ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. “వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేయడం వంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వేచ్ఛా వాణిజ్యం, నౌకాయానానికి ఆటంకం కలిగించవద్దు” అని ఓ ప్రకటనలో పేర్కొంది.

సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని, వారిని భారత్‌కు తిరిగి తీసుకురావడానికి ఒమన్ అధికారులతో సమన్వయం చేస్తున్నామని పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేశ్ మంగళ్ తెలిపారు. మరోవైపు, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్‌కు ఎల్‌పీజీతో వస్తున్న రెండు విదేశీ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -