Sunday, January 25, 2026
E-PAPER
Homeజాతీయంపోలీస్ స్టేషన్లో గన్ మిస్ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

పోలీస్ స్టేషన్లో గన్ మిస్ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నంద్యాల జిల్లా డోన్ పోలీస్ స్టేషన్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య గన్ హ్యాండోవర్ చేసే సమయంలో మిస్ఫైర్ జరిగి ఆయన మృతి చెందారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా సి.బెలగల్ గ్రామానికి చెందిన పెద్దయ్య గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. డోన్ జీఆర్పీ పోలీసు స్టేషన్ పరిధిలో పని చేస్తున్నారు. హుబ్లీ నుంచి విజయవాడకు వెళ్తున్న రైలులో విధి నిర్వహణలో ఉన్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తన విధులను ముగించుకున్నారు. గన్ హ్యాండోవర్ చేసేందుకు జీఆర్పీ పోలీసు స్టేషనుకు వెళ్లారు. ఈ క్రమంలో గన్ మిస్ ఫైర్ అయ్యి పెద్దయ్య తీవ్రంగా గాయపడ్డారు. తూటా శరీరంలోకి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలను వదిలేశారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -