Sunday, May 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యతోపాటు కళాత్మక రంగాల్లో విద్యార్థులు పట్టు సాధించాలి 

విద్యతోపాటు కళాత్మక రంగాల్లో విద్యార్థులు పట్టు సాధించాలి 

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌను 
విద్యార్థుల విద్యతో పాటు కాలాత్మక రంగాల్లో పట్టు సాధించాలని, జిల్లా విద్యాధికారి ఎ సత్యనారాయణ అన్నారు. ఆలేరు పట్టణంలో శనివారం  ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక (99డేస్ ) విద్యావారోత్సవాలు పురస్కరించుకొని, ఆర్ట్ , క్రాఫ్ట్  & డాన్స్ , సింగింగ్ పీఎం శ్రీ  స్కూల్స్ జిల్లా స్థాయి పోటీ లను పీఎంశ్రీ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు  కృషి పట్టుదలతో చదువులో రాణించాలన్నారు. శిక్షణా తరగతుల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ , జ్ఞాపికలను అందజేసి అభినందించారు. మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మీ ఆలేరు మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో  మంచి ఫలితాలు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.

సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దాసరి మంజుల అధ్యక్షత వహించారు. ఎఎంఓ జానీఫఘన్, ఎంఈఓ లక్ష్మి, రంగరాజన్ హాజరై పోటీ లకు జడ్జీలు గా వ్యవహారించారు. డాక్టర్ పోరెడ్డి రంగయ్య  వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంలు వేణుగోపాల్, సురేందర్ రెడ్డి, పి ఎం శ్రీ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -