– ఖేల్ మహోత్సవ్‌తో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలోని ఆర్కిడ్స్ హై స్కూల్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, ఉపన్యాసాలతో తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గత పది రోజులుగా పాఠశాలలో నిర్వహించిన గేమ్స్ అండ్ స్పోర్ట్స్ (ఖేల్ మహోత్సవ్) కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలు విద్యార్థులలో క్రీడాస్ఫూర్తి, శారీరక దృఢత్వం, జట్టు భావనను పెంపొందించాయని నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్ , సి.హెచ్. గోవర్ధన్ రెడ్డి, ఆర్ కే గ్రూప్ ఆఫ్ సీఈవో జైపాల్ రెడ్డి, డైరెక్టర్ సదాశివ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ భూ లక్ష్మీ, అకడమిక్ ఇన్‌చార్జ్ వసంత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆర్కిడ్స్ హై స్కూల్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



