నవతెలంగాణ-హైదరాబాద్ : డిజిటల్ ఫస్ట్ వ్యూహాన్ని పటిష్టం చేసుకునే దిశగా కీలక ముందడుగు వేస్తూ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ అప్‌గ్రేడెడ్ మొబైల్ బ్యాంకింగ్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం అయిన ఉజ్జీవన్ EZYని ఆవిష్కరించింది. బ్యాంకు యొక్క రిటైల్ కస్టమర్ల కోసం ఉద్దేశించబడిన ఉజ్జీవన్ EZY మొబైల్ మరియు వెబ్ మాధ్యమాలవ్యాప్తంగా ఏకీకృతమైన, సురక్షితమైన బ్యాంకింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇంగ్లీష్, హిందీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, ఒడియా, పంజాబీ మరియు తమిళంలాంటి తొమ్మిది భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది.
పొదుపు, చెల్లింపులు, రుణాలు, పెట్టుబడులను మరింత సమన్వయపర్చుకునే వీలు కల్పిస్తూ, రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణను సులభతరం చేసే దిశగా 90కి పైగా నూతన సామర్థ్యాలతో పాటు 200 పైచిలుకు బ్యాంకింగ్ ఫీచర్లు ఈ ప్లాట్‌ఫాంలో ఉంటాయి. కొత్త తరం మైక్రోసర్వీసుల స్వరూపానికి తగ్గట్లు EZY నిర్మితమైంది. కొత్త ఫీచర్లను వేగంగా ప్రవేశపెట్టడంలో, కస్టమర్ల మారుతున్న అవసరాలకు తగ్గట్లు మరింత సమర్ధవంతంగా స్పందించడంలో బ్యాంకుకు తోడ్పాటు అందించే విధంగా ఇది ఉంటుంది. అవసరాలకు తగ్గట్లు విస్తరించుకునే వెసులుబాటుతో, ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకోగలిగేలా సిస్టంను మరింత వేగవంతం చేస్తుంది.
ఖాతా నిర్వహణ, నిధుల బదిలీలు, ఫిక్సిడ్ మరియు రికరింగ్ డిపాజిట్లు, బిల్లుల చెల్లింపులు, డెబిట్ కార్డుల నిర్వహణ, జీఎస్టీ చెల్లింపులు, డీమ్యాట్ మరియు ఎన్పీఎస్ సహా ఇన్వెస్ట్మెంట్ సర్వీసులతో పాటు కీలకమైన బ్యాంకింగ్ సేవలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫాంపై EZY అనుసంధానం చేస్తుంది. ప్రస్తుతమున్న ఈ సర్వీసులకు తోడు, అప్‌గ్రేడ్ చేయబడిన ప్లాట్‌ఫాంలో రుణ సేవలు, స్మార్ట్ స్టేట్మెంట్లు, కొత్త డిజిటల్ సామర్థ్యాలు, వ్యక్తిగతీకరించిన ఇంటర్‌ఫేస్‌లు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. సమగ్రమైన బ్యాంకింగ్ అనుభూతిని కల్పిస్తూ కస్టమర్లకు మరింత సౌకర్యాన్ని, మెరుగైన అనుభూతిని అందించేందుకు ఇవన్నీ తోడ్పడతాయి.
యాక్సెసబిలిటీ మరియు సమ్మిళితత్వంపై దృష్టి పెడుతూ, వివిధ ప్రాంతాలవ్యాప్తంగా, వివిధ వయస్సుల వారికి, వివిధ స్థాయుల్లో డిజిటల్ సామర్థ్యాలున్న వారికి అనుగుణంగా ఉండేలా ప్లాట్‌ఫాం రూపొందించబడింది. యాప్ప్రొటెక్ట్ (AppProtectt) అనే అధునాతన సెక్యూరిటీ SDKని అనుసంధానించడం ద్వారా భద్రత మరింత మెరుగుపర్చబడింది. మోసాలు, డివైజ్ స్థాయి ముప్పులు, ఎప్పటికప్పుడు తలెత్తే సైబర్ రిస్కుల నుంచి మరింత రక్షణ కల్పించేలా ఇది రూపొందించబడింది.
“EZYని ఆవిష్కరించడమనేది మేము స్టాండెలోన్ డిజిటల్ మాధ్యమాల నుంచి ఏకీకృత డిజిటల్ వ్యవస్థకు మారడాన్ని సూచిస్తుంది. ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు, కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు, సుస్థిర ప్రాతిపదికన వ్యాపారాన్ని పెంచుకునేందుకు, అదే సమయంలో విశ్వసనీయత, సరళత్వం, భద్రత మరియు ఆర్థిక సమ్మిళితత్వంపై ఫోకస్‌ను కొనసాగించేందుకు ఈ ప్లాట్‌ఫాం తోడ్పడుతుంది” అనిఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ (స్ట్రాటెజీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్) Mr. దీపక్ అగర్వాల్ తెలిపారు.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు యొక్క మొత్తం ఔట్‌వార్డ్ లావాదేవీల్లో 95 శాతం పైగా వాటా డిజిటల్ పేమెంట్స్‌దే ఉంటున్న నేపథ్యంలో కస్టమర్ల పటిష్టమైన వినియోగ ధోరణులు, బ్యాంకు యొక్క డిజిటల్ వ్యవస్థపై నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ బ్యాంకు కార్యకలాపాల్లో డిజిటల్ మాధ్యమాలు మరింత కీలక పాత్ర పోషించడాన్ని కొనసాగించనున్నాయి.

