నవతెలంగాణ-హైదరాబాద్: బంగారం, వెండి ధరలు రన్నింగ్ రేసు మాదిరిగా పరుగెడుతున్నాయి. ఇవాళ ఒక్క రోజే కేజీ వెండి రేటు రూ. 25వేలు పెరిగింది. దీంతో సిల్వర్ ధర రూ. 4.25 లక్షలకు (కేజీ) చేరింది. మొత్తం మీద బంగారం వెండి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి రేట్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఔన్సు వెండి రేటు తొలిసారి 5,600 డాలర్లు దాటేసింది.
వెండి ధరలు పెరగడానికి కారణం పారిశ్రామిక డిమాండ్ పెరగడం మాత్రమే కాకుండా.. బలహీనమైన యూఎస్ డాలర్ సిల్వర్ రేటును అమాంతం పెంచేసిందని విశ్లేషకులు తెలిపారు. ఆర్థిక అనిశ్చితులు & పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా గోల్డ్, సిల్వర్ రేటు పెరగడానికి దొహదపడ్డాయని చెబుతున్నారు.



