- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం గిరిజన రైతులకు శుభవార్త అందించింది. వారి భూములకు సాగునీరు అందించే ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలును వేగవంతం చేసింది. ఇందుకోసం నాబార్డ్ నుంచి రూ.600 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా 10 వేల మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఒక్కో రైతుకు రూ.6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లను 100 శాతం సబ్సిడీతో అందించనుంది. మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్మడం ద్వారా రైతులు నెలకు రూ.3 నుంచి 5వేల వరకు ఆదాయం పొందవచ్చు.
- Advertisement -



