నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో రూ.2 కోట్ల విలువైన హెరాయిన్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సిబిఎన్) స్వాధీనం చేసుకుంది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. లక్నో-సీతాపూర్‌రోడ్‌లోని ఇటౌంజా టోల్‌ప్లాజా సమీపంలో నిర్వహించిన ఆపరేషన్‌లో 280 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ దాదాపు రూ.1.96 కోట్లు ఉంటుందని డిప్యూటీ నార్కోటిక్స్ కమిషనర్ (ఉత్తరప్రదేశ్ యూనిట్) ప్రవీణ్ బాలి తెలిపారు. నిర్దిష్ట సమాచారం మేరకు అధికారులు సోదాలు చేపట్టారని, బారాబంకికి చెందిన నివారణ మరియు నిఘా (పిఅండ్‌ఐ) సెల్ కూడా ఆపరేషన్‌లో పాల్గందని అన్నారు. సంబంధిత ఎన్‌డిపిఎస్ చట్టం, 1985 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రూ.2 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



