Saturday, January 31, 2026
E-PAPER
Homeజాతీయం'మియా ముస్లిం' వ్యాఖ్యలపై...సీఎం బిశ్వశర్మపై ఫిర్యాదు

‘మియా ముస్లిం’ వ్యాఖ్యలపై…సీఎం బిశ్వశర్మపై ఫిర్యాదు

- Advertisement -

న్యూఢిల్లీ : బెంగాలీ ముస్లింలను ఉద్దేశిస్తూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వివాదాస్పద ‘మియా ముస్లిం’ వ్యాఖ్యపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆయనపై రచయిత హర్ష్‌ మందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 196, 197, 299, 302, 353 సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహితలోని నిబంధనల కింద బిశ్వశర్మపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరారు. రాష్ట్రంలో సర్‌ ప్రక్రియ కొనసాగు తున్నందున భవిష్య త్తులో ఇలాంటి ప్రకటనలు చేయకుండా ముఖ్యమంత్రిని నిరోధించాలని, ఆయన చేసిన విద్వేషపూరిత, వివక్షా పూరిత వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని హజ్‌ కాస్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని మందర్‌ ఓ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

బిశ్వశర్మ ఏమన్నారంటే…
తిన్‌సుకియా జిల్లా దిగ్బరులో మంగళవారం జరిగిన అధికారిక కార్యక్రమంలో బిశ్వశర్మ మాట్లాడుతూ బెంగాలీ ముస్లింలను ‘మియా’లుగా అభివర్ణించారు. వారిపై
వేధింపులు, వివక్షను ప్రోత్సహించేలా ప్రకటనలు చేశారు. ఓటర్ల జాబితా నుంచి ముస్లింల పేర్లను తొలగించాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయాలని, అభ్యంతరాలు తెలపాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మియాలు ఇబ్బంది పడేలా చూడడమే తన పని అని చెప్పారు. వారిని ఇబ్బంది పెడుతుంటే అస్సాంను వదిలేసి వెళ్లిపోతారని అన్నారు. గతంలో కూడా బిశ్వశర్మ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -