Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ ఆధ్వర్యంలో టీబి ముక్త్ భారత్ అభియాన్

సర్పంచ్ ఆధ్వర్యంలో టీబి ముక్త్ భారత్ అభియాన్

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని రామడుగు గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా 81 మంది గ్రామస్థులకు ఎక్సరే, తేమడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకంగా మన భారత ప్రధాని చేపట్టినటువంటి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు వచ్చి ఎక్స్ రే, తెమడ పరీక్షలు, రక్త పరీక్షలు చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,  జిల్లా టీబి, కోఆర్డినేటర్ నరేష్, వార్డ్ మెంబర్లు, టిబి సూపర్వైజర్ స్రవంతి, రేడియోగ్రాఫర్ సురేందర్, కౌన్సిలర్ శివకుమార్ సాయికిరణ్ ప్రశాంత్,  వైద్య సిబ్బంది  హారిక, కమలా, సవిత, రూపకాల, ఉమారాణి, కవిత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -