Sunday, July 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ మునీర్‌ కన్నుమూత

తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ మునీర్‌ కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ :  తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎండీ మునీర్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఒమెగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. గతంలో సింగరేణిలో పనిచేసిన ఆయన వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. దశాబ్దాల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో సింగరేణి జేఏసీకి కన్వీనర్‌గా వ్యవహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -