Monday, May 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలం..

మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలం..

- Advertisement -

– ఎర్రగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా మహిళా వారోత్సవాలు
నవతెలంగాణ – కాటారం
గర్భిణీలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రక్తహీనత (అనీమియా) నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు  ఆకుకూరలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు, గుడ్లు వంటి పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారాలను ప్రతిరోజూ తీసుకోవాలని సీ డి పీ ఓ రాధిక మహిళాలకు  సూచించారు. కాటారం గ్రామపంచాయతి పరిధిలోని ఎర్రగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో 99 డేస్ ప్రణాళికలో భాగంగా సోమవారం నిర్వహించిన మహిళా వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై సీడీపీఓ రాధిక మాట్లాడుతూ… స్థానికంగా అందుబాటులో ఉండే తక్కువ ఖర్చుతో కూడిన పోషకాహార పదార్థాలను సరైన విధంగా వినియోగించుకుంటే కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, బాలింతలు, గర్భిణీలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

రక్తహీనత (అనీమియా) నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి వివరించిన ఆమె, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు, గుడ్లు వంటి పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారాలను ప్రతిరోజూ తీసుకోవాలని మహిళలకు సూచించారు. స్థానికంగా లభించే సహజ ఆహార పదార్థాల ద్వారానే పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చని పేర్కొన్నారు.

అనంతరం ఆహార వైవిధ్యం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై మహిళలకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శివరాణి, వార్డ్ మెంబర్ రాజబాబు, అంగన్వాడీ టీచర్లు ప్రేమలత, అనసూయ, హెల్పర్లు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -