- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై కేకే ట్రావెల్స్ ప్రయివేటు బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తుండగా ఒక్కసారిగా టైరు పగిలి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. 30 మందికి గాయాలు కాగా 0 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



