నవతెలంగాణ-హైదరాబాద్: వివాదాస్పద డేరా సచ్చా సౌదా అధినేత, అత్యాచార కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) కు హర్యానా ప్రభుత్వం 30 రోజుల పెరోల్ (Perole) మంజూరు చేసింది. దాంతో ఆయన రోహ్‌తక్ (Rohtak) లోని సునారియా జైలు బ్యారక్ నుంచి ఈ ఉదయం 6:30 గంటల సమయంలో భారీ పోలీసు భద్రత మధ్య విడుదలయ్యారు. డేరా బాబా ఇలా పెరోల్‌పై జైలు నుంచి బయటికి రావడం ఇది 16వ సారి.
సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు ఆగస్టు 2017లో గుర్మీత్ రామ్ రహీమ్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఆ సమయంలో ఆయనను దోషిగా ప్రకటించిన వెంటనే పంచకులతో పాటు హర్యానా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో డేరా అనుచరులు తీవ్ర హింసాకాండకు దిగారు.దాంతో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు.



