ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా సైకిల్ యాత్ర
నవతెలంగాణ-తుర్కపల్లి
జూన్ రెండవ తేదీలోగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉంటే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయిపల్లి,వెంకటాపూర్, తుర్కపల్లి వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యాత్ర నిర్వ హించారు. గ్రామంలోని ధాన్యం కొనుగోలుకేంద్రాలను ఎమ్మెల్యే సందర్శిం చారు.కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు అధికంగా ఉండడం, లారీల సమస్య, రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దన్నారు. జూన్ 2వ తేదీ వరకు ఏ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనూ ధాన్యం కనిపిస్తే అధికారుల పై చర్యలు తప్పవన్నారు. అనంతరం దత్తాయిపల్లి నుండి వెంకటాపురం గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్‌కు నాలుగు నుండి ఐదు చోట్ల లీకేజీలు ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే రాష్ట్ర మంత్రి సీతక్కతో ఫోన్‌లో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. స్పందించిన మంత్రి సీతక్క వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఐనాల చైతన్య మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దనావత్ శంకర్‌నాయక్ ,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షు చాడ భాస్కర్‌రెడ్డి, మండల స్థాయి అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలుంటే చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



