Sunday, May 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరి కొనుగోల్లపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయం

వరి కొనుగోల్లపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయం

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : రాష్ట్రంలో రబీలో జరుగుతున్న  వరి కొనుగోలపై గత మూడు నాలుగు రోజులుగా ఒకపక్క బిజెపి, మరోపక్క బిఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో చేసినటువంటి పని పైన కేవలం ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కల్లాల దగ్గరకు వెళ్తూ బిజెపి వాళ్లు రైతు గోసా అని, బిఆర్ఎస్ వాళ్ళు రైతులను గవర్నమెంట్ మోసం చేస్తుందని అసత్య ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో మానాల మోహన్ రెడ్డి మాట్లాడారు.

ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదవ సీజన్ కొనుగోలు చేస్తున్నామని, ఐదు సీజన్లలో ఎప్పుడు కూడా రైతుకు ఇబ్బంది పరిస్థితి కలగకుండా చూసుకున్నామన్నారు. ఈ మధ్యకాలంలో కొంత లారీల కొరతతో రైస్ మిల్లర్లు ఇబ్బంది పెట్టిన సందర్భంగా కొంత ఇబ్బంది అయిన మాట నిజమేనన్నారు. కానీ ఎక్కడ రైతుకు మేము కొనుగోలు చేయమని చెప్పలేదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ చెప్పినట్టు వరి వేసుకుంటే ఊరే లాంటి మాటలు మా ప్రభుత్వం గానీ, మా ముఖ్యమంత్రి గాని మాట్లాడిన సందర్భం లేదన్నారు. ఒకపక్క కేంద్రంపై పోరాటం చేయాల్సిన బిజెపి నాయకులు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడుతున్న విధానం చూస్తుంటే వాళ్ళ అనాలోచిత విధానానికి ఇదొక మచ్చుతునక అని పేర్కొన్నారు.

  ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వరి కొనుగోలు చేస్తుంటే ఎంఎస్పి ధర నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, కొనుగోలు చేసే బాధ్యత ఎందుకు తీసుకోదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. మన రాష్ట్రంలో 1,50,000 మెట్రిక్ టన్నుల వరి సేకరణ చేస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం 30 వేల టన్నులు మాత్రమే మేము తిరిగి తీసుకుంటామని చెప్పిన విధానం ఏదైతే ఉందో దీనిపై మాట్లాడావలసిన బాధ్యత ఈ రాష్ట్ర బిజెపి నాయకులకు లేదా అని నేను అడుగుతున్నానన్నారు.. ఆకాశం పై ఉమ్మేస్తే మన మీదే పడతాదని గుర్తుంచుకోవాలని బిజెపి వాళ్లకు హితవు పలికారు.ఈ రాష్ట్రంలో ఉన్న చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు.

పగటి వేషగలలా వస్తున్నా బిఆర్ఎస్, బిజెపి నాయకుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అన్ని రకాల లాభాలు చేయాలని చూస్తున్నాడని, అవన్నీ రైతులకు అందేలా తాము చూస్తామన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల రైతులు ఎక్కడన్నా మీకు వరి కొనుగోలు కేంద్రంలో ఇబ్బంది ఉంటే మాకు గాని, మా నాయకులకు గాని చెప్పాలన్నారు. గత నెల రోజులుగా అదే పని మీద ఉన్నాం, ఇంకో వారం రోజులు అదే పనిపై ఉండి పూర్తి చేస్తామన్నారు. ఈ సెంటర్లో ఇబ్బంది అని చెప్పితే అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి సమన్వపరిచే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటదని, రైతుల శ్రేయోభిలాషులుగా అది నా బాధ్యత అన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, మాజీ అధ్యక్షులు సుంకేట రవి, మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి తిప్పి రెడ్డీ శ్రీనివాస్,  కమ్మర్ పల్లి టౌన్ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, కుకునూరు గ్రామ సర్పంచ్ భూమారె,డ్డి పడగల గ్రామ సర్పంచ్ రాజు, అక్లూర్ గ్రామ సర్పంచ్ జనార్ధన్, అంక్సపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, నరేష్, గోపాల్, అరవింద్, బైండ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -