నవతెలంగాణ – చిన్నకోడూరు : వెనుక నుండి లారీ టూ వీలర్ ను ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రాముని పట్ల రాజీవ్ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీం నగర్ గ్రామానికి చెందిన కావటి ఎల్లం(40) సిద్దిపేటకు వెళ్తున్న తరుణంలో వెనుక నుండి లారీ(టీఎస్ 08- యుఎల్ 2778) ఢీకొని తన ద్విచక్ర వాహనంతో సహా ఎల్లంను సుమారు 50 మీటర్ల వరకు నెట్టుకు పోవడంతో అక్కడే మృతి చెందాడు రోడ్డు ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న చిన్నకోడూరు పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటన వివరాలు తెలుసుకొని రోడ్డును క్లియర్ చేశారు. మృతుని తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు చిన్న కోడూరు ఎస్సై చంద్రమోహన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇబ్రహీంనగర్‌కు చెందిన కావటి ఎల్లం మృతి చెందగా, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక బీఆర్‌ఎస్ నాయకుల ద్వారా బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.



