Saturday, June 13, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పవన్‌ కల్యాణ్‌ సభకు అనుమతి నిరాకరణ..

పవన్‌ కల్యాణ్‌ సభకు అనుమతి నిరాకరణ..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: నగరంలో జూన్‌ 2న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్‌ సమ్మేళనం’ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో తెలంగాణ జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు.

జనసేన నేత మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాము సభ పెట్టట్లేదని, సమావేశం నిర్వహించుకుంటున్నామని చెప్పారు. కన్వెన్షన్ సెంటర్లలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంపై పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది.. అనుమతి ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. సరైన కారణాలు చెప్పకుండా పోలీసులు అనుమతి నిరాకరించారని, సమావేశం అనుమతి కోసం కోర్టును ఆశ్రయించామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -