తన అద్భుత నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌లు, పవర్ఫుల్ యాక్షన్‌తో కోట్లాది అభిమానులు, ప్రేక్షకుల మనసు గెలుచుకున్న చిరంజీవి తన సినీ ప్రయాణంలోని ఓ అమూల్యమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు. దశాబ్దాలుగా అగ్ర కథానాయకుడిగా అలరిస్తున్న ఆయన నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’. ఈ సినిమా కోసం మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన ప్రత్యేక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘ఈరోజు ”పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది.
ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాదిరాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు’ అని చిరు పేర్కొన్నారు. తాజాగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో చిరు నటించిన ‘మన వరశంకర ప్రసాద్‌గారు’ సినిమా విశేష ప్రేక్షకాదరణతో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
మాటల్లో వర్ణించలేనిది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



