- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విజయనగరం జిల్లా అలజంగి వద్ద సెవెంత్ డే ప్రయివేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. దీంతో 22 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాఠశాల బస్సులో ఎంత మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు, బోల్తా పడటానికి గల కారణాలు వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



