నవతెలంగాణ – హైదరాబాద్ : 12 సంవత్సరాల బాలికపై లైంగిక దాడి చేసి, అనంతరం హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగవంతంగా విచారించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సంబంధిత కమిషన్ సభ్యులు చిట్యాల శ్వేతకి నాయకులు వినతిపత్రం అందజేశారు. బాధిత బాలికకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించడంతో పాటు కుటుంబానికి భద్రత కల్పించి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏదునూరి మదర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు, ఖమ్మం జిల్లా కార్యదర్శి అన్నారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణ జ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు శశికళ, కవిత పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
12 ఏళ్ల బాలికపై దాడి ఘటన.. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని వినతిపత్రం
- Advertisement -
- Advertisement -



