Friday, June 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల కోల్ బ్లాక్-1మైన్లో ఆడిట్ విజయవంతం

తాడిచెర్ల కోల్ బ్లాక్-1మైన్లో ఆడిట్ విజయవంతం

- Advertisement -

సంతృప్తి వ్యక్తం చేసిన ఇంజనీర్లు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం ఓసిపి కోల్ బ్లాక్-1 మైన్లో ఆడిట్ విజయవంతమైనట్లుగా ఏఎమ్మార్ కపెనీ హెడ్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఇంజినీర్స్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్.సిఐ), హైదరాబాద్ కు చెందిన అధికార బృందం ఆడిట్ విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. ఈ ఆడిట్ బృందానికి కె.జె.అమరనాథ్, మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ (మైనింగ్) నాయకత్వం వహించారని, మార్గదర్శకత్వంలో ప్రాజెక్టులోని అన్ని విభాగాలలో అమలవుతున్న భద్రత, ఆరోగ్య నిర్వహణ విధానాలను సమగ్రంగా పరిశీలించి (అద్వయనం) మూల్యాంకనం చేశారని తెలిపారు.

ఆడిట్ బృందంలో వి.లక్ష్మీనారాయణ, మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కె.ఎన్.యాదవ్, మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఎలక్ట్రికల్),పి.కుమార్, మాజీ జనరల్ మేనేజర్ (మెకానికల్) హాజరయ్యారు. ఆడిట్ సందర్భంగా గని కార్యకలాపాలు, భద్రతా వ్యవస్థలు, ఆరోగ్య నిర్వహణ విధానాలు మరియు చట్టబద్ధమైన నిబంధనల అమలును బృందం కుణ్ణంగా పరిశీలించిందన్నారు. ఏఎంఆర్ తాడిచెర్ల కోల్ బ్లాక్-1లో అమలవుతున్న భద్రతా కార్యక్రమాలు, నిర్వహణ వ్యవస్థలు, ఉత్తమ పద్ధతులను ఆడిట్ బృందం విశేషంగా అభినందించిందన్నారు.

అలాగే, కార్మికుల్లో ఉన్న భద్రతా అవగాహన స్థాయి, సురక్షిత పనితీరు పద్ధతులపై వారి పరిజ్ఞానం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధత, సురక్షితమైన పని వాతావరణాన్ని కొనసాగించాలనే వారి నిబద్ధత పట్ల ఆడిట్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఏఎంఆర్ తాడిచెర్ల కోల్ బ్లాక్-1 తరపున ఆడిట్ అధికారులకు ప్రాజెక్టులో అమలవుతున్న భద్రత, ఆరోగ్య నిర్వహణ విధానాలను బృందానికి ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ ఏ. ప్రభాకర్ రెడ్డి, సీనియర్ మేనేజర్ కె.ఎస్.ఎస్. మూర్తి, మైన్ మేనేజర్ జి. శ్రీనివాస్, సేఫ్టీ ఆపిసర్ కె.సురేష్ బాబు, ప్రాజెక్టు ఇంజనీర్ కె.కిషన్, సర్వేయర్ ఎం. సర్వోత్తమ్, డిజిఎం జి. రమేష్ బాబు వివరించారు. ఆడిట్ బృందం అందించిన విలువైన సూచనలు, సిఫార్సులకు ఏఎంఆర్ తాడిచెర్ల కోల్ బ్లాక్-1 యాజమాన్యం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -