Saturday, June 13, 2026
E-PAPER
Homeజాతీయం10 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

10 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ‌ణ ర‌వాణ నివార‌ణ‌ ల‌క్ష్యంగా ఛత్తీస్‌గఢ్ పోలీసులు కీల‌క ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. శనివారం బలరాంపూర్ పోలీసులు సుమారు రూ. 10 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఖచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, సుమారు 1941 కిలోల బరువున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారని బలరాంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) వైభవ్ బ్యాంకర్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఈ మాదకద్రవ్యం మార్కెట్ విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిందితుల నుంచి ట్రక్కును కూడా స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. అరెస్టు అయిన నిందితులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన లోకేష్ శర్మ (46) అమీష్ అన్సారీ (23)గా గుర్తించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌న్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -