ధీరజ్, కుమ్‌కుమ్ జోడి ఘనత
న్యూఢిల్లీ : ఆసియా చాంపియన్ బొమ్మదేవర ధీరజ్ మరోసారి మెరిశాడు. ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో పసిడి పతకం గురి పెట్టాడు. ఆదివారం జరిగిన రికర్వ్ విభాగంలో 17 ఏండ్ల యువ ఆర్చర్ కుమ్‌కుమ్ మొహోద్‌తో కలిసి ధీరజ్ దుమ్మురేపాడు. ఫైనల్లో ఒలింపిక్ పతక విజేతలు దక్షిణ కొరియా ఆర్చర్లు యెజిన్, కిమ్ డియోక్‌లపై 5-1 (37-36, 37-36, 39-39)తో భారత జోడీ విజయం సాధించింది. ఆదివారం జరిగిన రికర్వ్ వ్యక్తిగత విభాగం సెమీఫైనల్లో యూరోపియన్ చాంపియన్ వైజర్‌పై 6-4తో గెలుపొందిన ధీరజ్.. పసిడి పోరులో ఆర్చరీ లెజెండ్, దక్షిణ కొరియా స్టార్ లీ వూ సియోక్‌పై 7-3తో అద్భుత విజయం సాధించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అటాను దాస్ తర్వాత ప్రపంచకప్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన ఆర్చర్‌గా ధీరజ్ నిలిచాడు.
ఆర్చరీలో పసిడి గురి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



