Tuesday, June 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గంజాయి, మత్తు పదార్థాల నివారణపై అవగాహన

గంజాయి, మత్తు పదార్థాల నివారణపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  ఆవరణలో మంగళవారం గంజాయి, మత్తు పదార్థాల నివారణపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ సి.హెచ్ సతీష్ ముఖ్య అతిథిగా  హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ నేటి విద్యార్థి దశలో ఉన్న యువత మత్తు పదార్థాలకు, గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి సారించి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలన్నారు.ఇటువంటి వ్యసనాలు జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. సమాజంలో మత్తు పదార్థాల రహిత వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -